'గ్యాంగ్‌' సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

- January 05, 2018 , by Maagulf
'గ్యాంగ్‌' సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

‘గ్యాంగ్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రాయదుర్గంలోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా హీరో సూర్య డ్యాన్సులతో దుమ్మురేపారు. తొలిసారి ఈ సినిమాలో తన పాత్రకు తానే తెలుగులో డబ్బింగ్‌ చెప్పుకొన్నానని, తన ప్రయత్నం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నానని సూర్య అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కాబోతున్న తమ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ఈ వేడుకలో హీరోయిన్‌ కీర్తిసురేష్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ నటి రమ్యకృష్ణతోపాటు పలువురు చిత్రబృందం ఈ వేడుకలో పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com