గల్ఫ్‌ కప్‌ విజయం: ఒమన్‌కి యూఏఈ లీడర్స్‌ అభినందనలు

- January 06, 2018 , by Maagulf
గల్ఫ్‌ కప్‌ విజయం: ఒమన్‌కి యూఏఈ లీడర్స్‌ అభినందనలు

వైస్‌ ప్రెసిడెంట్‌, ప్రైమ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ యూఏఈ, దుబాయ్‌ రూలర్‌ షేక్‌ మొహమ్మద్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌, అబుదాబీ క్రౌన్‌ ప్రిన్స్‌, యూఏఈ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ డిప్యూటీ సుప్రీమ్‌ కమాండర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ 23వ గల్ఫ్‌ కప్‌ విక్టరీ సందర్భంగా ఒమన్‌ జట్టుని అభినందించారు. ట్విట్టర్‌లో షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ శుభాకాంక్షలు తెలుపుతూ, ఒమన్‌ ఆటగాళ్ళు అత్యద్భుతమైన ప్రతిభను కనబర్చారని అన్నారు. కప్‌ని ఒమన్‌ తీసుకెళ్ళినా, అది సోదరులకే దక్కిందన్న ఆనందం తమలో ఉందని చెప్పారాయన. యూఏఈ, ఒమన్‌ రెండు జట్లూ పోరాట స్ఫూర్తిని కనబర్చాయని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. కువైట్‌ అమిర్‌కి సైతం ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ, ఇంత పెద్ద ఈవెంట్‌ని అత్యద్భుతంగా నిర్వహించారని పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com