గల్ఫ్‌ కప్‌ ఫైనల్‌: బ్యారియర్‌ కూలి 40 మందికి గాయాలు

- January 06, 2018 , by Maagulf
గల్ఫ్‌ కప్‌ ఫైనల్‌: బ్యారియర్‌ కూలి 40 మందికి గాయాలు

కువైట్‌లో ఒమన్‌ - యూఏఈ మధ్య జరిగిన గల్ఫ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా స్టేడియం బ్యారియర్‌ కూలి 40 మందికి గాయాలయ్యాయి. మ్యాచ్‌ని ఒమన్‌ గెలిచిన కాస్సేపటికే ఈ ప్రమాదం జరిగింది. కువైట్‌ ఎఫ్‌ఎ ట్విట్టర్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. షేక్‌ జబెర్‌ అల్‌ అహ్మద్‌ స్టేడియం - కువైట్‌ సిటీలో ఈ ప్రమాదం జరిగిందని అధికారిక ప్రకటనలో వెల్లడించారు. గాయపడ్డవారంతా క్షేమంగానే ఉన్నారని కువైట్‌ అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఆటగాళ్ళను అభినందించే క్రమంలో అభిమానులు చూపించిన అత్యుత్సాహం కూడా ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com