పోలవరం-పట్టిసీమ ప్రాజెక్టులు సందర్శించిన ప్రవాసులు

- January 08, 2018 , by Maagulf

ఏపీ ఎన్ఆర్‌టీ ఆధ్వర్యంలో 12దేశాల నుండి వచ్చిన ప్రవాసాంధ్ర బృందం సోమవారం నాడు పోలవరం-పట్టిసీమ ప్రాజెక్టులను సందర్శించింది. ఈ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీరు రమేష్‌బాబు, ప్రాజెక్టుల్లో జరుగుతున్న పనులను గురించి ఎన్నారై బృందానికి వివరించారు. అంతకుముందు తాటిపూడిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ బృందంతో భేటీ అయ్యారు. ఏపీ ఎన్ఆర్‌టీ బృందం చేపట్టిన స్మాష్ & ట్రాష్ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఏపీ ఎన్ఆర్‌టీ ఆధ్వర్యంలో వివిధ దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల వివరాలను సమగ్రంగా సేకరిస్తున్నామని, గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆంధ్రుల కోసం ప్రత్యేక పథకాన్ని చేపడుతున్నామని ఆయన తెలిపారు. ప్రవాసాంధ్రులకు అవసరమైన అన్ని రకాల సేవలను ఏపీ ఎన్ఆర్‌టీ ద్వారా అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. జన్మభూమి పథకంలో ప్రవాసాంధ్రులు విరివిగా పాల్గొని తమ గ్రామాల అభివృద్ధికి తోడ్పాటును అందించాలని బాబు విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్నం దేవరపల్లి గ్రామంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముళ్లపూడి వెంకటరావు మంచి విందును ఏర్పాటును చేసి ప్రవాసులకు గోదావరి రుచులను చవిచూపించారు. కార్యక్రమంలో ఏపీ ఎన్ఆర్‌టీ సీఈఓ డా.వేమూరు రవికుమార్, కలపటు బుచ్చిరాంప్రసాద్, మేడి మాధవి, డీవీ రావు తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com