సినిమా హాళ్లలో జాతీయగీతం తప్పనిసరి కాదు: సుప్రీంకోర్టు

- January 09, 2018 , by Maagulf
సినిమా హాళ్లలో జాతీయగీతం తప్పనిసరి కాదు: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : సినిమా హాళ్లలో జాతీయ గీతం ప్రదర్శన తప్పనిసరి కాదని మంగళవారం సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. తప్పనిసరిగా ప్రదర్శించాలన్న నిబంధనను సవరించింది. థియేటర్‌ యజమానులు తమకిష్టమైనప్పుడు ప్రదర్శించవచ్చని స్పష్టం చేసింది. అయితే జాతీయగీతాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు లేచి నిలబడాలన్న నిబంధనలో మార్పులేదని పేర్కొంది. సినిమా హాళ్లలో సినిమా ప్రదర్శనకు ముందు జాతీయగీతాన్ని తప్పనిసరిగా ప్రదర్శించాలని, ఆసమయంలో ధియేటర్‌లో ఉన్న వారు లేచి నిలబడాలని సుప్రీంకోర్టు 2016, డిసెంబరు 30న ఆదేశించిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com