ప్రైవేటు రంగంలోనూ కువైట్ పౌరుల ఉద్యోగ శాతం పెంచడానికి ప్రతిపాదన ఆమోదం

- January 10, 2018 , by Maagulf
ప్రైవేటు రంగంలోనూ కువైట్ పౌరుల ఉద్యోగ శాతం పెంచడానికి ప్రతిపాదన ఆమోదం

కువైట్: అటు ప్రభుత్వ ..ఇటు ప్రయివేట్ రంగాలలో స్థానికులు తమకే ఉద్యోగాలలో అగ్ర స్థానం కల్పించాలని కోరుతున్నారు. వారి కోర్కె మేరకు ప్రవాసీయులు చేసే ఉద్యోగ స్థానాలలో  17,000 మంది కువైట్ పౌరులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి జాతీయ ఉద్యోగుల వ్యక్తిగత రేటును పెంచే ప్రభుత్వ  , మానవ వనరుల పునర్నిర్మాణ కార్యదర్శి (జిఎంఆర్పి) సెక్రటరీ జనరల్ ఫవజీ అల్-మగ్దాలి చేసిన  ప్రతిపాదనని ఆమోదించింది. దీని ప్రకారం ప్రతి స్థాపనలో మొత్తం శ్రామికశక్తీ  75 శాతాన్ని మించకూడదు. బ్యాంకింగ్ రంగంలో జాతీయ శ్రామిక బలం రేటు 64 నుండి 70 శాతానికి, కమ్యూనికేషన్ రంగాలలో 60 నుండి 65 శాతానికి, బీమా రంగం 18-22 శాతం నుండి, ద్రవ్య మార్పిడి రంగం 12 నుండి 15 శాతానికి పెంచాలని సూచిస్తూ ప్రధాన సవరణలపై సూచించారు. అదేవిధంగా అరబిక్ ప్రైవేట్ విద్యా రంగంలో10-12 శాతం నుండి, మరియు ఆంగ్ల విద్యలో 5 నుండి 10 శాతం వరక పెంచాలని ప్రతిపాదించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com