షార్జా స్పోర్ట్స్‌ డిజర్ట్‌ ఫెస్టివల్‌కి సర్వం సిద్ధం

- January 10, 2018 , by Maagulf
షార్జా స్పోర్ట్స్‌ డిజర్ట్‌ ఫెస్టివల్‌కి సర్వం సిద్ధం

రెండో ఎడిషన్‌ షార్జా స్పోర్ట్స్‌ డిజర్ట్‌ ఫెస్టివల్‌ (ఎస్‌ఎస్‌డిఎఫ్‌), శుక్రవారం 12 జనవరి 2018 నుంచి అల్‌ బడాయెర్‌ డిజర్ట్‌లో ప్రారంభం కానుంది. 'బికమ్‌ ఎ డిజర్ట్‌ హీరో' కాన్సెప్ట్‌తో ఎమిరేట్స్‌లోనే మోస్ట్‌ పాపులర్‌ ఆఫ్‌ రోడ్‌ రేసింగ్‌ కాంపిటీషన్‌ని షార్జా స్పోర్ట్స్‌ టీవీ నిర్వహిస్తోంది. ఒక్కో కేటగిరీ నుంచీ 15 మంది పార్టిసిపెంట్స్‌ వైట్‌ నకల్‌ టైమ్‌ ఛాలెంజ్‌ రేస్‌కి ఎంపిక చేయబడ్తారు. మోటార్‌ క్రాస్‌ 1, మోటార్‌ క్రాస్‌ 2, డిజర్ట్‌ అల్‌ టెర్రైన్‌ వెహికిల్‌, యుటిలిటీ టాస్క్‌ వెహికిల్స్‌ వంటివి ఈ డిజర్ట్‌ ఫెస్టివల్‌లో ప్రధాన ఆకర్షణ కానున్నాయి. సౌతాఫ్రికాకి చెందిన ఛాంపియన్‌ మిఖాయిల్‌ డోచెర్తీ ఎఎక్స్‌ 1 క్లాస్‌లో పోటీ పడ్తున్నారు. బ్రిటిష్‌ మోటోక్రాస్‌ రైడర్‌ రయాన్‌ బ్లెయిర్‌ ఎంఎక్స్‌2లో పోటీ పడ్తున్నారు. ఎమిరేటీ మోటో క్రాస్‌ రైడర్‌ సుల్తాన్‌ అల్‌ బలూషి, ఖలీఫా అల్‌ రాస్సి కూడా పోటీల్లో పాల్గొంటున్నారు. ప్రారంభ ఫెస్టివల్‌ ఘనవిజయాన్ని అందుకుందనీ, రెండో సీజన్‌ ఇంకా ఘనంగా జరుగుతుందని షార్జా స్పోర్ట్స్‌ టీవీ డైరెక్టర్‌ రషీద్‌ అల్‌ ఒబాద్‌ చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com