భారత్‌కు లెవల్-2 కేటాయించిన అమెరికా
- January 11, 2018
వాషింగ్టన్ : భారతదేశంలో విదేశీ పర్యాటకులు ప్రయాణించాలంటే అనేక జాగ్రత్తలు తీసుకోవాలని తాజా ప్రయాణ సలహా మండలి పేర్కొంది. భారత్‌తో పాటు దేశాలకు ఒక కొత్త ప్రయాణ సలహాలను యునైటెడ్ స్టేట్స్ జారీ చేసింది. ఇది వినియోగదారులకు స్నేహపూర్వకమవుతుందని పేర్కొన్నారు. దీనిలో నాలుగు స్థాయిలు ఉంటాయని, ఈ స్థాయిలలో భారత్‌ది లెవల్ -2 కాగా, పాకిస్తాన్‌ది లెవల్ -3 అని పేర్కొన్నారు. లెవల్ -1 అయితే ప్రయాణికులు సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలని, లెవల్ -4 అయితే ప్రయాణం చేయవద్దని సూచించింది. ఆఫ్ఘనిస్తాన్ వంటి ప్రాంతాలకు లెవల్ -4 కేటాయించింది. భారత్‌కు కేటాయించిన రెండవ లెవల్ అంటే హెచ్చరికలు, జాగ్రత్తలు పెరుగుతాయని సూచించింది. మూడవ లెవల్ అంటే ప్రయాణంపై పునరాలోచించుకోవాలని సూచనలు జారీ చేసినట్లు తెలిపింది. ఈ వ్యవస్థద్వారా ప్రతిదేశం ఒక ప్రయాణపు సలహాను కలిగి వుంటుందని, ఇది గతంలో వున్న సలహాలను భర్తీ చేస్తుందని పేర్కొన్నారు. ఇవి ప్రపంచ వ్యాప్తంగా స్పష్టమైన, సమయానుకూలమైన , విశ్వసనీయమైన భద్రత, భద్రతా సమాచారాన్ని యుఎస్ పౌరులకు అందజేస్తుందని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ పేర్కొంది. భారత్‌లో అత్యధికంగా పెరుగుతున్న నేరాలలో అత్యాచారాలు ఒకటని, దీంతో పర్యాటక ప్రదేశాలలో లైంగిక వేధింపులు, హింస వంటివి పెరుగుతున్నాయని కొత్త భారత ప్రయాణపు సలహాలలో పేర్కొంది. దీంతో భారత్‌కు లెవల్ 2ను కేటాయించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







