లెస్బియన్ గా నిత్యమీనన్
- January 11, 2018
నిత్యమీనన్.. బబ్లీగా ట్రెండీ కేరక్టర్స్ తో ఆకట్టుకున్న హీరోయిన్.! జనతాగ్యారేజ్ సూపర్ హిట్ తర్వాత టాలీవుడ్ కు దూరమైపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ ఓ సెన్సేషన్ కేరక్టర్ తో సిల్వర్ స్క్రీన్ పై సంచలనం సృష్టించేందుకు రెడీ అవుతోంది.
నిత్యమీనన్ విలక్షణ నటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. బోల్డ్ నెస్ బ్యూటీగా నిత్యమీనన్ కు పేరుంది. కేరక్టర్ ను ఆచితూచి ఎంచుకోవడంలో నిత్యమీనన్ ముందుంటుంది. జనతా గ్యారేజ్ తర్వాత కనిపించకపోవడంతో ఇక తెరమరుగైపోయిందని అందరూ భావించారు. అయితే టాలీవుడ్ లో కనిపించకపోయినా కోలీవుడ్ లో విజయ్ తో జతకట్టి మెర్సెల్ లో మెరిసిపోయింది. అది బంపర్ హిట్ కావడంతో నిత్యమీనన్ మళ్లీ ట్రాక్ లోకి వచ్చింది. ఇప్పుడు ఆ జోష్ ను మళ్లీ కంటిన్యూ చేసేందుకు సిద్ధమైంది.
జనతా గ్యారేజ్ తర్వాత నిత్యమీనన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఆ..!' ఇందులో నిత్యమీనన్ కేరక్టర్ చాలా బోల్డ్ అని సమాచారం. లెస్బియన్ గా నిత్యమీనన్ పాత్ర శెభాష్ అనిపించబోతోందనే టాక్ ఇప్పటికే వినిపిస్తోంది. ట్రెండ్ ను సెట్ చేసే కేరక్టర్లు చేయడంలో నిత్యమీనన్ ముందుంటారు. ఇప్పుడు లెస్బియన్ గా కనిపిసించి సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుందనేది టాలీవుడ్ టాక్. గతంలో గంగ సినిమాలో హ్యాండీకాప్డ్ గా నటించి మెప్పించింది నిత్యమీనన్.
ఒకప్పుడు వరుస ఛాన్స్ లతో అదరగొట్టిన నిత్యమీనన్ జనతాగ్యారేజ్ లాంటి హిట్ మూవీ తర్వాత కనుమరుగైపోయింది. అయితే ఇప్పుడు మాత్రం వచ్చిన ఛాన్స్ లను మిస్ చేసుకునే ఉద్దేశం కనిపించడం లేదు. ఆ.. తర్వాత మరో మల్టీలింగ్యువల్ మూవీ ఛాన్స్ కూడా కొట్టేసింది నిత్యమీనన్. నిజార్ షఫీ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కపోతోంది. సో.. నిత్య మళ్లీ నేనున్నానంటూ వచ్చేసిందన్నమాట.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







