భార్యల్ని సంతృప్తి పరచేందుకు డ్రగ్స్ వినియోగం
- January 11, 2018
తన ముగ్గురు భార్యల్ని సంతృప్తి పరిచేందుకోసం తాను డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు విచారణలో నిందితుడు అంగీకరించడం సంచలనంగా ఉంది. జిసిసి జాతీయుడు, షార్జా మిస్డెమీనర్ కోర్టులో విచారణకు హాజరయ్యాడు. నిందితుడిపై మెఠాంఫెటమైన్ క్రిస్టల్ లేదా క్రిస్టల్ మెథ్ (యూఏఈలో షెబుగా వ్యవహరిస్తారు) వినియోగిస్తున్నట్లు కేసు నమోదయ్యింది. విచారణ సందర్భంగా, న్యాయస్థానాన్ని కన్విన్స్ చేసేందుకు నిందితుడు ప్రయత్నించాడు. తాను అమాయకుడిననీ, తన ముగ్గురి భార్యలను సంతృప్తి పరచేందుకే డ్రగ్స్ తీసుకున్నానని పేర్కొన్నాడు. తన స్నేహితుడు ఇచ్చిన ఓ మందు కారణంగా తాను హైపర్ యాక్టివ్గా మారేవాడిననీ, అలా తనకు ఆ మందు అలవాటయ్యిందని చెప్పాడు. ఆ మందు యూఏఈలో నిషేధించబడిందని తనకు తెలియదని అంతకు ముందు న్యాయస్థానం యెదుట మొరపెట్టుకున్నాడు. అయితే ఆ తర్వాత మాట మార్చాడు. నిషేధిత మందు అని తెలిసీ, తన భార్యల కోసం అలా చేయాల్సి వచ్చిందనీ, తన ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని తనను క్షమించాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశాడు.
తాజా వార్తలు
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక







