25 ఏళ్ల పైబడిన మహిళలు పర్యాటక వీసాపై ఒంటరిగా సౌదీఅరేబియాకు వెళ్లేందుకు అనుమతి
- January 11, 2018
రియాద్:పర్యాటక వీసాపై సౌదీ వెళ్లే మహిళల వెంట వారి కుటుంబ సభ్యులు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన గతంలో ఉండేది. ఆ నిబంధనను మార్పు సౌదీఅరేబియా సవరించింది. పాతికేళ్ల పైబడిన మహిళలు పర్యాటక వీసాపై ఒంటరిగా సౌదీఅరేబియాకు వెళ్లేందుకు అనుమతినిచ్చింది. నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకున్న మహిళలకు సౌదీ వెళ్లేందుకు అనుమతి జారీ చేయనున్నామని సౌదీ కమిషన్ ఫర్ టూరిజం అండ్ నేషనల్ హెరిటేజ్(ఎస్‌సీటీహెచ్) వెల్లడించింది. అయితే 25 ఏళ్ల లోపు వయసున్నవారి వెంట కుటుంబ సభ్యులు తప్పనిసరిగా ఉండాలని అధికారులు తేల్చిచెప్పారు. ఇదిలావుండగా పాత నిబంధనల ప్రకారం పర్యాటక వీసాపై సౌదీ వెళ్లే మహిళల వెంట వారి కుటుంబ సభ్యులు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన గతంలో అమల్లో ఉండేది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







