సల్మాన్‌ను చంపేందుకు కుట్ర.!
- January 12, 2018
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను చంపడానికి కొందరు దుండగులు ఆయన సినిమా 'రేస్ 3' సెట్ పరిసరాల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పోలీసులు బాంద్రాలోని ఆయన ఇంటికి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 'సల్మాన్, ఆయన కుటుంబ సభ్యులకు హానితలపెడుతామని బెదిరింపులకు పాల్పడటం ఇది తొలిసారి కాదు. అయినా సల్మాన్ బాడీగార్డులు లేకుండా బయటికి వస్తున్నారు.. ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆయనకు మరింత భద్రత అవసరం' అని సీనియర్ ఇన్‌స్పెక్టర్ అన్నారు. మరోపక్క నిర్మాత రమేశ్ 'రేస్ 3' సినిమా సెట్‌కు భద్రత పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నారట.
గురువారం పోలీసులు ముంబయి ఫిల్మ్‌సిటీలో 'రేస్ 3' సినిమా సెట్‌కు వెళ్లారు. షూటింగ్ ఆపాలని, వీలైనంత తొందరగా సల్మాన్‌ను తన ఇంటికి పంపించాలని నిర్మాత రమేశ్ తౌరాని కోరారు. అనంతరం స ల్మాన్ ఆరుగురు పోలీసులతో కలిసి వేరే కారులో ఇంటికి బయలుదేరారు. ఆయన సొంత కారులో మరికొందరు పోలీసులు ఇంటికి చేరుకున్నారు.
సల్మాన్ కొన్నేళ్ల క్రితం ఓ సినిమా షూటింగ్ కోసం జోధ్‌పూర్‌కు వెళ్లారు . ఈ క్రమంలో అక్కడ జింకను చంపాడన్న కారణంగా ఆయనపై కేసు నమోదైంది. ప్రస్తుతం తుది విచారణ జరుగుతోంది. విచారణలో భాగంగా ఇటీవల సల్మాన్ జోధ్‌పూర్ కోర్టుకు వెళ్లారు.
మరోకేసులో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్నోయ్‌ను పోలీసులు అదే సమయంలో భద్రత మధ్య కోర్టుకు తీసుకొచ్చారు. ఈ సమయంలో లారెన్స్.. సల్మాన్‌ను చంపుతామని, ఆయనకు తమ పవర్ తెలియాలని బెదిరించాడు.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







