తమిళనాడు లో త్వరలో 1600మంది జీవిత ఖైదీలకు విముక్తి
- January 12, 2018
ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎంజీ రామచంద్రన్, జయలలితల జయంతి సందర్భంగా తమిళనాడు జైళ్లలోని 1,600 మంది యావజ్జీవ ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం విముక్తి కల్పించనున్నది. ఎంజీఆర్ జయంత్యుత్సవాలను ఈనెల 17వ తేదీన, వచ్చే నెల 25న జయలలిత జయంతిని నిర్వహించనున్నారు. ఈ సందర్భాలను పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ జైళ్లలో పదేళ్లకుపైగా యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అన్ని జైళ్లలోని జాబితాను కలుపుకుంటే 1,900 మంది ఖైదీల విడుదలకు జైళ్లశాఖ నుంచి సిఫార్సులు అందాయి. వీరిలో 1,600 మంది ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









