అరబ్ బాలుడి పట్ల భారతీయ వాచ్‌మన్ అకృత్యం ..మూడు నెలల జైలుశిక్ష..దేశ బహిష్కరణ
- January 13, 2018
దుబాయ్: కామంతో ...కన్నూ ..మిన్నూ కానరాని ఓ భారతీయ నైట్ వాచ్మెన్ ముక్కుపచ్చలారని అరబ్ బాలునితో అసహజ కామవాంఛలు తీర్చుకోబోయి నిఘా కెమెరాల సాక్షిగా అడ్డంగా దొరికిపోయాడు. ఆ నేరం రుజువుకావడంతో మూడు నెలల జైలుశిక్షతోపాటు దేశ బహిష్కరణకు గురయ్యాడు. యూఏఈలో జరిగిన ఈ నేరానికి సంబంధించిన వివరాల ప్రకారం భారతదేశానికి చెందిన ఓ 37 ఏళ్ల వ్యక్తి దుబాయ్ నగరంలోని సీసీ కెమేరాల పర్యవేక్షణ రూంలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. అన్నిచోట్ల నిఘా ఉంటుందని ..పర్యవేక్షణ రూమ్ లో కెమెరాలు గట్రా ఉండదని బహుశా కాబోలు 6 ఏళ్ల వయసున్న ఓ అరబ్ బాలుడికి మాయమాటలు చెప్పి గదిలోకి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలుడికి ముద్దులు పెట్టడంతోపాటు...పలుచోట్ల అసభ్యకరంగా చేతులు పెట్టి తడిమేడు. ఈ వికృత ఈ దృశ్యాలన్నీ సీసీ కెమేరాల్లో ఎంచక్కా రికార్డయ్యాయి. బాలుడు తనకు ఎదురైన పరిస్థితిని కుటుంబసభ్యులకు వెల్లడించడంతో చేసిన పాపం వెలుగులోకి వచ్చింది. దాంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు విచారణలో నేరం ఎన్నో ఆధారాలతో సహా రుజువుకావడంతో నిందితుడికి మూడు నెలల జైలుశిక్ష విధించారు. శిక్షాకాలం ముగిసిన తర్వాత దేశం నుంచి వెళ్లగొట్టాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది.
తాజా వార్తలు
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?







