25 ఏండ్లు దాటిన మహిళలు ఒంటరిగా సౌదీకి రావొచ్చు.!
- January 13, 2018
ఇన్నిరోజులు సౌదీ అరేబియాను సందర్శించాలంటే మహిళలకు కచ్చితంగా పక్కన ఓ తోడు ఉండాలి. లేదంటే ఆ దేశం టూరిస్ట్ వీసానే జారీచేయదు. కానీ ప్రస్తుతం 25 సంవత్సరాలు, ఆపైబడిన మహిళలు ఇక ఒంటరిగా టూరిస్ట్ వీసాపై సౌదీ అరేబియాను సందర్శించవచ్చట. ఈ విషయాన్ని సౌదీ కమిషన్ ఫర్ టూరిజం, నేషనల్ హెరిటేజ్ అధికార ప్రతినిధి చెప్పారు. కుటుంబ సభ్యులు లేదా సహచరులు అవసరం లేకుండానే మహిళలు సౌదీ అరేబియా సందర్శించే స్వేచ్ఛను తాము కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కానీ 25 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న మహిళలు మాత్రం సౌదీ అరేబియాకి ప్రయాణించాలంటే కచ్చితంగా ఎవరో ఒకరు తోడు ఉండాల్సిందేనని తెలిపారు. ''టూరిస్ట్ వీసా అనేది సింగిల్-ఎంట్రీ వీసా. గరిష్టంగా 30 రోజులు కాలవ్యవధితో ఉంటుంది. ఇది వర్క్, విజిట్, హజ్, ఉమ్రా వీసాలు నుండి స్వతంత్రంగా ఉంటుంది'' అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది కమిషన్స్ లైసెన్సింగ్ డిపార్ట్‌మెంట్ ఉమర్ అల్-ముబారక్ తెలిపారు. టూరిస్ట్ వీసాలకు సంబంధించిన నిబంధనలు తుది రూపకల్పన జరిగాయని, ఈ నిబంధనలను 2018 తొలి క్వార్టర్‌లో ప్రకటించనున్నామని పేర్కొన్నారు. కేంద్ర సమాచార సెంటర్, విదేశీ మంత్రిత్వశాఖ ప్రతినిధులతో కలిసి టూరిస్ట్ వీసాల జారీ కోసం ఎలక్ట్రానిక్ సిస్టమ్‌ను కమిషన్ ఐటీ డిపార్ట్‌మెంట్ అభివద్ధి చేస్తుందని అల్-ముబాకర్ తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







