కూలిన హెలికాప్టర్, ఐదుగురు మృతి
- January 13, 2018
మహారాష్ట్రలో శనివారం ఓ రోడ్డు ప్రమాదం, పడవ ప్రమాదం, హెలికాప్టర్ ప్రమాదం జరిగాయి. ఈ ప్రమాదాల్లో 14 మంది మృతిచెందారు. ఆయిల్, నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్‌జీసీ) సిబ్బంది ఐదుగురు, ఇద్దరు పైలట్‌లతో ప్రయాణిస్తున్న పవన్ హన్స్ హెలికాప్టర్ ముంబై తీరప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. ఉదయం 10.30 గంటలకు జుహు ఎరోడ్రోమ్ ప్రాంతం నుంచి బయలుదేరిన ఈ విమానం కొద్దిసేపటికే అదృశ్యమైంది. ఈ విషయాన్ని గుర్తించిన ఓఎన్‌జీసీ.. ముంబై తీరప్రాంత సిబ్బందికి సమాచారం అందించింది. దీంతో నౌకదళం, ఓఎన్‌జీసీ సిబ్బంది రంగంలోకి దిగి గాలింపు చేపట్టారు. ఐదుగురి మృతదేహాలను గుర్తించారు. మిగిలిన ఇద్దరి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







