నకిలీ ఫోన్లు చేసే భారతీయ వలసదారులకు దుబాయ్ హెచ్చరిక

- January 14, 2018 , by Maagulf
నకిలీ ఫోన్లు చేసే భారతీయ వలసదారులకు దుబాయ్ హెచ్చరిక

దుబాయ్: ' పాము తన పిల్లలను తానె తిన్నట్లుగా ..కొందరు భారతీయవలసదారులు తమ స్వదేశీయులనే మోసంకు గురిచేస్తున్నారు. ఒకరి అవసరం..అమాయకత్వం మరొకరికి ఆదాయ వనరు  కాకూడదని దుబాయ్ రాయబార కార్యాలయం ఆ తరహా మోసగాళ్లకు దుబాయ్ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. ఇమ్మిగ్రేషన్ కార్యకాలయం పేరిట దుబాయ్ నుంచి మోసపూరితమైన ఫోన్ కాల్ చేస్తూ కొంతమంది అమాయకుల నుంచి డబ్బులు నగదుని గుంజుకొంటున్నారని ఎంబసీ అధికారులు తెలిపారు. కొంతమంది భారతీయ వలసదారులు ఈ కుంభకోణానికి పాల్పడినట్లు రాయబార కార్యాలయ అధికారులు  చెప్పారు. భారత ఎంబసీ కూడా ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని భారతీయ వలసదారులను తీవ్రంగా  హెచ్చరించింది. అటువంటి మోసపూరిత విధానాలకు  పాల్పడవద్దని అధికారులు హెచ్చరించారు. అలాగే తమ వ్యక్తిగత వివరాలను సామాజిక మాధ్యమాలలో పోస్టు చేయొద్దని అధికారులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com