అగ్ని ప్రమాదంతో మల్కియాలో మాతమ్ ధ్వంసం
- January 15, 2018
మనామా: అగ్ని ప్రమాదం కారణంగా మాతమ్ (కమ్యూనిటీ మరియు రెలిజియస్ సెంటర్) ధ్వంసమైన ఘటన నార్తరన్ గవర్నరేట్ పరిధిలో జరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం కలగలేదు. ఇంటీరియర్ మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం మల్కియా విలేజ్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుందనీ, తెల్లవారుఝామున 1.15 నిమిషాల సమయంలో అగ్ని ప్రమాదం జరిగిందనీ, ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణమని తెలియవస్తోంది. సివిల్ డిఫెన్స్ డైరెక్టరేట్, సకాలంలో స్పందించి అగ్ని కీలల్ని ఆర్పివేశాయి. ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఎండోవ్మెంట్స్ మినిస్ట్రీ - జఫ్ఫారియా వక్ఫ్ డైరెక్టరేట్ (జెడబ్ల్యుడి) - జస్టిస్ ఈ ఘటనను ధృవీకరించింది. మాటమ్స్ మరియు రెలిజియస్ సెంటర్స్ - జఫ్ఫారీ సెక్షన్‌కి సంబంధించి జెడబ్ల్యుడి అధీకృత సంస్థ. జెడబ్ల్యుడి ప్రెసిడెంట్ షేక్ మొహ్సెన్ అల్ అస్ఫూర్, సంఘటనా స్థలాన్ని సందర్శించారు. తక్షణం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదిక తనకు అందజేయాలని ఆయన సంబంధిత అధికారుల్ని ఆదేశించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







