చీజ్‌టిక్కీ
January 16, 2018
కావల్సినవి: లేత మొక్కజొన్న గింజలు - ముప్పావుకప్పు, స్వీట్‌కార్న్ - అరకప్పు, చీజ్ - అరకప్పు, ఉల్లికాడల తరుగు - చెంచా, కొత్తిమీర - కట్ట, ఎండుమిర్చి గింజలు - అరచెంచా, ఉప్పు - తగినంత, మొక్కజొన్న పిండి - టేబుల్‌స్పూను, నూనె - వేయించేందుకు సరిపడా
తయారీ: నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ ఓ గిన్నెలోకి తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి. తరవాత టిక్కీల్లా చేసుకుని కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇవి వేడివేడిగా తింటేనే బాగుంటాయి.