నిద్రకు మద్యం దెబ్బ!
- January 16, 2018
పడుకునే ముందు మద్యం తాగితే నిద్ర బాగా పడుతుందని కొందరు భావిస్తుంటారు. దీంతో మొదట్లో నిద్రమత్తు ముంచుకొస్తుండొచ్చు. కానీ సమయం గడుస్తున్నకొద్దీ మత్తు ప్రభావం తగ్గిపోయి.. తరచుగా మెలకువ వస్తూనే ఉంటుంది. కోడి నిద్రే మిగులుతుంది. గాఢ నిద్ర గణనీయంగా తగ్గిపోతుంది. ఫలితంగా ఉదయం నిద్రలేచాక ఏమంత హుషారుగా ఉండదు. అలాగే మద్యం తాగి నిద్రపోయినవారికి కలలు వచ్చే అవకాశం ఎక్కువ. పీడకలలూ రావొచ్చు. కొందరు నిద్రలో లేచి నడుస్తుంటారు కూడా. మద్యం మత్తు కారణంగా శరీరంలోని అన్ని కండరాలు వదులవుతాయి. గొంతు వెనకాల కండరాలు వదులైతే శ్వాసమార్గానికి అడ్డంకి తలెత్తటం, గురక వంటివీ మొదలవుతాయి.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







