యూఏఈలో ఖతారీ షేక్ నిర్బంధం
- January 16, 2018
దోహా: ఖతార్ రాయల్ ఫ్యామిలీకి చెందిన సభ్యుడొకరు, తాను యూఏఈలో నిర్బంధానికి గురైనట్లు ఆరోపిస్తున్నారు. వివాదాస్పదుడిగా ఈ ఖతారీ షేక్‌పై ఆరోపణలున్నాయి. షేక్ అబ్దుల్లా బిన్ అలి అల్ థని, దోహాతో అబుదాబీ - రియాద్ సంబంధాలు తెంచుకున్నాక మీడియేటర్‌గా తెరపైకొచ్చారు. ఖతార్‌కి చెందిన అల్ జజీరా టెలివిజన్ ప్రసారం చేసిన వీడియోలో, షేక్ ఓ కుర్చీలో కూర్చుని ఉన్నట్లుగా తెలియజేస్తోంది. అబుదాబీలో ఉన్న తనకు ఏమైనా జరిగితే ఖతార్‌కి చెడ్డ పేరు వస్తుందనీ, తాను యూఏఈ క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కి అతిథినని చెబుతున్నట్లుగా వీడియోలో ఉంది. ఖతార్ ప్రజలు అమాయకులని అందులో షేక్ పేర్కొన్నారు. తనకు ఏం జరిగినా దానికి షేక్ మొహ్మద్ బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు షేక్ అబ్దుల్లా.
తాజా వార్తలు
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక







