కజకిస్తాన్‌:బస్సులో అగ్ని ప్రమాదం.. 52 మంది మృతి

- January 18, 2018 , by Maagulf
కజకిస్తాన్‌:బస్సులో అగ్ని ప్రమాదం.. 52 మంది మృతి

మాస్కో: కజకిస్తాన్‌లో ఘోర విషాదం జరిగింది. ఓ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో 52 మంది మరణించారు. అక్టోబ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 57 ప్రయాణికుల్లో కేవలం 5 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. వాళ్లంతా ప్రస్తుతం హాస్పటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే బాధితులంతా పొరుగు దేశం ఉజ్బెకిస్తాన్‌కు చెందినవారని తెలుస్తోంది. ఏ కారణం చేత బస్సు అగ్ని ప్రమాదానికి గురైందన్న అంశం ఇంకా స్పష్టంగా తెలియలేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com