జుట్టు రాలకుండా...చిట్కాలు

జుట్టు రాలకుండా...చిట్కాలు

రోజుకి వంద వెంట్రుకలు రాలినా భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇంతకంటే ఎక్కువ రాలుతుంటే మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే! పోషకాహార లోపం లేకుండా చూసుకోవటంతోపాటు ఇదిగో ఇంట్లోనే ఈ చిట్కాలు ప్రయోగించండి.

అప్పుడే కోసిన ఉల్లి చెక్కను తీసుకుని వెంట్రుకల కుదుళ్లలో పది నిమిషాలపాటు రుద్దాలి. ఉల్లిలోని సల్ఫర్‌ వెంట్రుకల కుదుల్లను బలంగా ఉంచే కొల్లాజెన్‌ ఉత్పతయ్యేలా చేస్తుంది. దాంతో వెంట్రుకలు రాలటం తగ్గుతుంది. తలస్నానం చేసేటప్పుడు వేడి, చల్లని నీళ్లను రెండిటినీ వాడాలి. వేడి నీటితో తలస్నానం పూర్తి చేసినా చివర్లో చల్లని నీళ్లను తల మీద గుమ్మరించుకోవాలి. ఇలా చేస్తే కుదుళ్లు మూసుకుపోయి వెంట్రుకలు రాలకుండా ఉంటాయి.

Back to Top