బ్రిటిష్ ఎంపీల చే ఆమోదింపబడ్డ బ్రెగ్జిట్‌ బిల్లు

- January 18, 2018 , by Maagulf
బ్రిటిష్ ఎంపీల చే ఆమోదింపబడ్డ బ్రెగ్జిట్‌ బిల్లు

యూరపియన్‌ యూనియన్‌ నుంచి వైదొలిగే బ్రెగ్జిట్‌ బిల్లును బ్రిటన్‌ పార్లమెంట్‌  దిగువ సభ (హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌) ఆమోదించింది.  బ్రెగ్జిట్‌ బిల్లుపై దిగువ సభలో జరిగిన ఓటింగ్‌లో ప్రధాని థెరిసా మే వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం సాధించారు. ఈ ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 324 మంది ఎంపీలు ఓటేయగా, వ్యతిరేకంగా 295 మంది ఓటేశారు. దిగవ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు.. ఇక ఎగువ సభలోనూ పాసవ్వాలి. 

యూరోపియన్‌ యూనియన్‌ చట్టాలన్నీ బ్రిటన్‌ చట్టాలుగా మారడానికి ఉద్దేశించిన 1972 చట్టం ప్రకారమే హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌ (ఎగువ సభ)లో బ్రెగ్జిట్‌పై చర్చ జరగనుంది. ఇదిలావుండగా దిగువ సభ అయిన హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో బ్రెగ్జిట్‌ బిల్లు ఆమోదమే అత్యంతక కీలక ఘట్టమని నిపుణులు చెబుతన్నారు. దిగువ సభలో బ్రెగ్జిట్‌ బిల్లు ఆమోదం పొందడం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని బ్రెగ్జిట్‌ సెక్రెటరీ డేవిడ్‌ డేవిస్‌ అన్నారు.

బ్రిటన్‌ ప్రయోజనాలకే ఐరోపా సమాఖ్య నుంచి బయటకు వస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈయూ నుంచి బ్రిటన్‌ సాఫీగా బయటకు రావడానికి ఇది ఎంతో దోహదం చేస్తుందని డేవిడ్‌ డేవిస్‌ చెప్సారు. దిగువ సభలో బ్రెగ్జిట్‌ బిల్లు ఆమోదం పొందడం ప్రధాని థెరిసా మే సాధించిన ఘనవిజయంగా విశ్లేషకులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com