ప్రదీప్‌ కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

- January 19, 2018 , by Maagulf
ప్రదీప్‌  కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

హైదరాబాద్‌ : టీవీ యాంకర్‌ ప్రదీప్‌ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ప్రదీప్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ను 3  ఏళ్లు రద్దు చేయడంతో పాటూ రూ. 2100 జరిమానా విధించింది. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసు విచారణ నిమిత్తం ప్రదీప్‌ తండ్రితో కలిసి శుక్రవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యాడు. డ్రంక్‌ డ్రైవ్‌ చేయకూడదని ఇదివరకు ప్రచారం కూడా చేశావు, అలాంటిది తెలిసి ఎలా తప్పు చేశారని ప్రదీప్‌ను కోర్టు ప్రశ్నించింది. తప్పు జరిగిపోయింది అని ప్రదీప్‌ అంగీకరించారు. ఊహంచని విధంగా కోర్టు తీర్పు వెలువరించడంతో ప్రదీప్‌ ఖిన్నుడయ్యారు.

గత ఏడాది డిసెంబర్‌ 31వ తేదీ అర్ధరాత్రి జరిపిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో ప్రదీప్‌ పరిమితి మించి మద్యం సేవించి వాహనాన్ని నడుపుతూ  పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. బ్రీత్‌ అనలైజర్‌లో సుమారు 178 పాయింట్లు చూపించింది. దీంతో ఈ నెల 8న తన తండ్రితో కలసి గోషామహల్‌లోని ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో కౌన్సెలింగ్‌కు ప్రదీప్‌ హాజరయ్యాడు. ఈ కౌన్సిలింగ్‌లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ వల్ల కలిగే అనర్థాలు వివరించడంతోపాటు.. మరోసారి తాగి వాహనం నడుపవద్దంటూ ప్రదీప్‌కు పోలీసుల సూచనలు ఇచ్చారు. ఇక తాను చేసిన తప్పును మరెవరూ చేయవద్దంటూ ప్రదీప్‌ ఓ వీడియోను పోస్ట్‌ చేసిన విషయం విదితమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com