ఒమన్‌ కోస్ట్‌లో భూకంపం

- January 19, 2018 , by Maagulf
ఒమన్‌ కోస్ట్‌లో భూకంపం

మస్కట్‌: ఒమన్‌ తీరంలో భూకంపం నమోదయ్యింది. రిక్టర్‌ స్కేల్‌పై ఈ తీవ్రత 4.5గా ఉందని అధికారులు వెల్లడించారు. భూకంప కేంద్రం, సలాలా సౌత్‌ నుంచి 290 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. సుల్తాన్‌ కుబూస్‌ యూనివర్సిటీ ఎర్త్‌క్వేక్‌ మానిటరింగ్‌ సెంటర్‌ ఈ మేరకు వివరాల్ని వెల్లడించింది. ఒమన్‌ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.37 నిమిషాల సమయంలో ఈ భూకంపం సంభవించింది. గత నెలలో, అంటే డిసెంబర్‌ 19న దుక్మ్‌ ప్రాంతానికి 320 కిలోమీటర్ల దూరంలో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com