జిసిసి భద్రతా ప్రమాణాలు లేని బొమ్మల స్వాధీనం

- January 19, 2018 , by Maagulf
జిసిసి భద్రతా ప్రమాణాలు లేని బొమ్మల స్వాధీనం

మనామా: డైరెక్టరేట్‌ ఆఫ్‌ స్టాండర్డ్స్‌ అండ్‌ మిటియరాలజీ - మినిస్ట్రీ ఆఫ్‌ ఇండస్ట్రీ కామర్స్‌ అండ్‌ టూరిజం 11,055 బొమ్మల్ని స్వాధీనం చేసుకుంది. జిసిసి భద్రతా ప్రమాణాలు లేకపోవడంతో వీటిని స్వాధీనం చేసుకున్నారు. నీటిలో నానితే ఈ బొమ్మల సైజ్‌ డబుల్‌ అవుతుంది. కాబట్టి, ఇవి పొరపాటున కడుపులోకి వెళితే తీవ్రమైన ప్రమాదం వాటిల్లుతుంది. స్టాండర్డైజేషన్‌ అండ్‌ మిటియరాలజీ డైరెక్టర్‌ మోనా అలలావి మాట్లాడుతూ కొన్ని శాంపిల్స్‌ని పరీక్షలకు పంపించామనీ, అవి జిసిసి రెగ్యులేషన్‌కి విరుద్ధంగా ఉండటంతో స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ తరహా బొమ్మల్ని కనుగొనేందుకోసం ప్రత్యేకంగా ఇన్‌స్పెక్షన్‌ క్యాంపెయిన్‌ ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. 50 దుకాణాల్లో తనిఖీలు జరిగాయి. తనిఖీల అనంతరం ఆయా షాప్‌ ఓనర్స్‌కి హెచ్చరికలు జారీ చేశారు. బొమ్మల్ని విక్రయించేవారు ఖచ్చితంగా నిబంధనల్ని పాటించాలని అధికారులు పేర్కొన్నారు. 
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com