దుబాయ్‌ టూరిస్ట్‌కి లైంగిక వేధింపులు: నిందితుడికి జైలు

- January 19, 2018 , by Maagulf
దుబాయ్‌ టూరిస్ట్‌కి లైంగిక వేధింపులు: నిందితుడికి జైలు

దుబాయ్‌:33 ఏళ్ళ వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. నార్వేకి చెందిన టూరిస్ట్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డ నేరానికిగాను న్యాయస్థానం ఈ శిక్ష విధించింది. తన స్నేహితుడికి చెందిన కారులో నార్వే టూరిస్ట్‌ని లైంగికంగా వేధించినట్లు నిందితుడిపై ఆరోపణలు నమోదయ్యాయి. అయితే తన మీద నమోదైన ఆరోపణల్ని నిందితుడు తొలుత ఖండించాడు. 2016 డిసెంబర్‌ 19న ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలికి డ్రింక్‌లో మత్తు మందు కలిపి, ఆమెపై నిందితుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అయితే తొలుత బాధితురాలు దొంగతనానికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఆమెకు తనపై జరిగిన లైంగిక దాడి గురించి తెలుసుకుని, ఆ కోణంలోనూ పోలీసులకు సమాచారం అందించింది. సీసీటీవీ కెమెరా ఫుటేజీల ఆధారంగా నిందితుడ్ని పోలీసులు గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com