కొట్లాటలో బహ్రెయినీ యువకుడి మృతి

- January 19, 2018 , by Maagulf
కొట్లాటలో బహ్రెయినీ యువకుడి మృతి

మనామా: హూరాలో ఓ కొట్లాట 13 ఏళ్ళ బహ్రెయినీ యువకుడి మృతికి కారణమైంది. మృతుడ్ని అబ్దుల్లా హమీద్‌గా గుర్తించారు. సుడాన్‌ రీజియన్‌కి చెందిన బహ్రెయినీ పౌరుడు అబ్దుల్లా హమీద్‌. రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు యువకులు కొట్టుకున్నట్లు ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ఇంకో వ్యక్తికి చెందిన సోదరులు, సన్నిహితులు అబ్దుల్లాని కొట్టి చంపినట్లు వారు పేర్కొన్నారు. పదునైన స్టీల్‌ రాడ్‌తో అబ్దుల్లా ఛాతి మీద అవతలి వ్యక్తులు కొట్టారనీ, పొట్టలోనూ, తలపైనా ఆ ఆయుధంతో విక్షణా రహితంగా కొట్టడం జరిగిందనీ, ఈ క్రమంలో అబ్దుల్లా కిందపడిపోగా, అతని తలకి ఓ రాయి బలంగా తాకిందని ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. ఈ ఘటన తర్వాత అవతలి వ్యక్తి పారిపోగా, పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఘటన జరిగిన కాస్సేపటికే పోలీసులు స్పందించి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com