మాన.. ప్రాణరక్షణ లేని కువైట్ దేశానికి వెళ్లవద్దని సూచిస్తున్న ఫిలిఫైన్ అధ్యక్షుడు

- January 20, 2018 , by Maagulf
మాన.. ప్రాణరక్షణ లేని కువైట్ దేశానికి  వెళ్లవద్దని సూచిస్తున్న ఫిలిఫైన్ అధ్యక్షుడు

కువైట్: ' బతికి ఉంటే ...బలుసాకు తిందాం '  కానీ కువైట్ లో ఉద్యోగాలు చేయనవసరం లేదని ..అక్కడకు వెళ్లవద్దని   తమ దేశ పౌరులకు ఫిలిఫైన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కువైట్‌లో తమ పౌరులపై విచక్షణ రహిత రీతిలో దాడులు పెరిగిపోతున్నాయని ఫిలిఫైన్ విదేశాంగ కార్యదర్శి సిల్వస్టర్ బెలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ దేశ పౌరులు ఎంతో కష్టించి పనిచేస్తారని పైగా తమ దేశస్తులకు చక్కని ఇంగ్లీషు రావడంతో యూరప్ దేశాలు కూడా తమ వారికే ప్రాధాన్యమిస్తాయని బెలో చెప్పారు. అయితే మరే దేశంలో జరగని విధంగా ఈ మధ్య కాలంలో కువైట్‌లో ఇంటి పనులు పనులుచేస్తున్న తమ దేశ మహిళలపై కువైట్ లో లైంగికదాడులు జరుగుతున్నాయని బెలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసందర్భాల్లో లైంగికదాడులు తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని బెలో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 2లక్షల 50వేల మంది ఫిలిఫైన్ పౌరులు కువైట్‌లో పనిచేస్తున్నారని వారితో తమ దేశం రెండు వందల కోట్ల ఆదాయం అర్జిస్తోందని బెలో చెప్పారు. అయితే తమ పౌరుల భద్రత కంటే సంపాదన ముఖ్యం కాదని బెలో తేల్చిచెప్పారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com