400 డాలర్లను మార్చి, 500,000 దిర్హామ్‌లు గెల్చుకున్న మహిళ
- January 20, 2018
దుబాయ్:అల్ అన్సారీ ఎక్స్‌ఛేంజ్ - వింటర్ ప్రమోషన్ 2017 బంపర్ డ్రాలో ఓ మహిళ 500,000 దిర్హామ్‌లు గెల్చుకున్నారు. కిర్గిస్తాన్‌కి చెందిన ధ్జీన్‌బయీవా ఈ బంపర్ ఆఫర్‌లో విజేతగా నిలిచి అందర్నీ ఆశ్చర్యపరిచారు. సోషల్ మీడియాలో లైవ్‌గా ఈ బంపర్ డ్రాని తీశారు. అల్ అన్సారీ ఎక్స్‌ఛేంజ్ మేనేజర్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ (దుబాయ్) ప్రతినిథులు ఈ బంపర్ డ్రా కార్యక్రమంలో పాల్గొన్నారు. 500,000 దిర్హామ్‌ల డ్రీమ్ ప్రైజ్‌ని గెల్చుకోవడం పట్ల ధ్జీన్‌బయేవా ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నట్లు ఆమె వివరించారు. ఈ సందర్భంగా అల్ అన్సారీ ఎక్స్‌ఛేంజ్‌కి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అల్ బర్షాలోని అల్ అన్సారీ ఎక్స్‌ఛేంజ్ బ్రాంచ్‌లో ఆమె 400 డాలర్లను ఎక్స్‌ఛేంజ్ చేశారు. బంపర్ డ్రాలో కిలో బంగారాన్ని ఇండియాకి చెందిన కుల్దీప్ సింగ్ గెల్చుకున్నారు. సెల్ఫీ కాంటెస్ట్‌లో ఐపాడ్ ప్రో, ఐఫోన్‌ఎక్స్ సహా పలు క్యాష్ ప్రైజ్ విన్నర్స్ కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!