నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంబులెన్స్ డ్రైవర్ అరెస్టు, సస్పెండ్
- January 21, 2018
మనామా : " మాంసం తిన్నానని ...వెనకటికి ఒకడు... ఎముకలు .మెడలో వేసుకొన్నాడట " అచ్చం అదే మాదిరిగా ఓ డ్రైవర్ వేగంగా అంబులెన్సు నడపడమే కాక ఆ వాహనంతో స్టంట్ విన్యాసాలు చేయిస్తూ...ఆ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో తన గొప్పలను చూడండహో అంటూ పోస్ట్ చేశాడు. దేశమంతా వేగంగా పాకిపోయిన ఆ వీడియోలు తన ఉద్యోగానికి ఎసరు పెట్టింది. ఆ నిర్లక్ష్యపు అంబులెన్స్ డ్రైవర్ ను అదుపులోనికి తీసుకోవడమే కాక ఉద్యోగ విధుల నుండి సైతం తొలగించారు. గత వారం ఒక బహ్రెయిన్ డ్రైవర్ స్నాప్ చాట్ లో తన వ్యక్తిగత అకౌంట్ లో పోస్ట్ చేసిన సంగీతం మిక్స్ చేసిన అనేక సాహసేపేత వీడియోలను పోస్ట్ చేసాడు. అంతటితో ఊరుకోకుండా తన డ్రైవింగ్ నైపుణ్యాలు గురించి ఒక వృద్ధ మహిళతో మాట్లాడుతూ తాను రాజధాని తూర్పు భాగాలలో జఫ్ఫాయిర్ ఔల్ అవెన్యూలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో డ్రైవింగ్ చేసేవాడినని డప్పాలు కొట్టాడు. అంబులెన్సు సైరెన్లు మోగించుకొంటూ ఎన్నోమార్లు ఎరుపు లైట్లు దాటి వెళ్లినట్లు సోషల్ మీడియాలో ప్రగల్బాలు పలికెడు. దీంతో ఈ వీడియోలు త్వరితగతిన ఆ వివిధ స్థానిక నెట్వర్క్లలలో బహిర్గతమయ్యాయి. "డ్రైవర్ యొక్క ప్రవర్తన బాధ్యతారాహిత్యం మరియు అంబులెన్స్ సిబ్బంది యొక్క మానవతావాద బాధ్యతలను అతిక్రమించాడని పలువురు దేశవ్యాప్తంగా ఈ తరహా చర్యలను ఖండించారు. ఈ వీడియోలు నిజమేమేనని మంగళవారం విడుదలైన ఒక ప్రకటనలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. దీంతో కేసు దర్యాప్తు ప్రారంభించింది మరియు అంబులెన్స్ సిబ్బంది ద్వారా ఆ డ్రైవర్ ప్రవర్తన తప్పుపట్టింది."ఇది వ్యక్తిగత ప్రవర్తన అని క్షమించరానిది మరియు విధి నిర్వహణలో నిర్లక్ష్యపు విధానాలను ప్రతిబింబిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తన నియామక సమయంలో వృత్తి పవిత్రతను కాపాడటానికి, గౌరవించటానికి మరియు వారు పనిచేస్తున్న ఆరోగ్య సంస్థ యొక్క చట్టాల ద్వారా కట్టుబడి ఉంటానని ప్రతిజ్ఞ చేశారని మంత్రిత్వ శాఖ తెలిపింది, ఆ వ్యక్తి సల్మానియా మెడికల్ అంబులెన్స్ డ్రైవర్ ను విపరీత పోకడలను సోషల్ మీడియాలో వేగవంతంగా పోస్టులు పంపిణీ చేసిన కారణంగా డ్రైవర్ ను అరెస్టు చేశారు, ఆ వ్యక్తిపై చట్టపరమైన ప్రక్రియలు తీసుకున్నాయని "అంతర్గత వ్యవహారాల శాఖలో ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ పేర్కొంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి