భాగమతి ప్రీ రిలీజ్ వేడుక..
- January 22, 2018
అందాల తార అనుష్క శెట్టి నటిస్తున్న తాజా చిత్రం భాగమతి. థ్రిల్లర్ కథతో దర్శకుడు అశోక్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు మిగతా మూడు దక్షిణాది భాషల్లో భాగమతి తెరపైకి రానుంది. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలను హైదరాబాద్‌లో నిర్వహించారు. నిర్మాత అల్లు అరవింద్, దర్శకులు మారుతి, రాధాకృష్ణ, మేర్లపాక గాంధీ, కథానాయకుడు నాని తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ.. భాగమతి కథను 2012లో విన్నాను. అప్పటికే బాహుబలి, సింగం 3 చిత్రాలతో నా డేట్స్ ఖాళీగా లేవు. కథ నచ్చినా చేయలేని పరిస్థితి ఏర్పడింది. నేను చేయలేనని చెప్పినా.నా కోసం నాలుగేళ్లు వేచి చూశారు. నా హృదయానికి దగ్గరైన చిత్రమిది. ఇది నా చిత్రమే కాదు..మిగతా ప్రధాన నటీనటులు కథలో కీలకంగా ఉంటారు. వాళ్ల నట ప్రతిభ భాగమతిని మరో స్థాయికి తీసుకెళ్లింది. అని చెప్పింది. దర్శకుడు అశోక్ మాట్లాడుతూ..భాగమతి కథను ముందు ప్రభాస్ గారికి చెప్పాను. తనతో పాటు తన చుట్టూ ఉన్న అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి అతను. ప్రభాస్ వల్లే భాగమతి ఇక్కడిదాకా వచ్చింది. అనుష్క ఏ పాత్రలోనైనా ఇమిడిపోగల నాయిక. అరుంధతి, రుద్రమదేవి, వేదంలో సరోజ, ఇప్పుడు భాగమతి. ఇలా విభిన్నమైన పాత్రల్లో ఒదిగిపోతుంది. అనుష్క ఒక శక్తి. సినిమా కోసం ఆమె తీసుకునే శ్రమ అద్భుతం. భాగమతి కోసం 45 రోజులు దుమ్ములో నటించారు. ఇక నిర్మాతలు వంశీ, ప్రమోద్, విక్కీ సినిమా కోసం ఎంతైనా శ్రమిస్తారు. ఐదేళ్లుగా ఈ నిర్మాతలతో ప్రయాణం చేస్తున్నాను. ఈ కథలో తామూ ఓ పాత్ర చేస్తున్నంత శ్రద్ధగా ప్రధాన సాంకేతిక నిపుణులు పనిచేశారు అన్నారు.
నాని మాట్లాడుతూ..భాగమతి ఇంటర్వెల్ చూసి అద్భుతంగా ఉందంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి చెప్పారు. ఈ ఏడాది అన్ని పురస్కారాలు అనుష్కకే దక్కుతాయని చెప్పారు. నాతో పిల్ల జమీందార్ రూపొందించిన అశోక్‌కు ఆ సినిమా పేరు ఇంటిపేరైంది. ఇకపై భాగమతి అశోక్‌గా పిలుస్తారు. అన్నారు. ఈ లోగా ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. గతంలో అనుష్క పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్ తాజాగా..మరో పోస్టర్‌ను బయటకు తీసుకొచ్చారు.
దర్శకుడు అశోక్ భాగమతి గురించి మాట్లాడుతూ.ఈ చిత్రం కోసం అనుష్క 18 కిలోల బరువు తగ్గింది. సినిమా అంతా అనుష్క పాత్ర చుట్టూ నే తిరుగుతుంది. అయితే అనేక కీలక పాత్రలు కథలో ఉంటాయి. టైటిల్‌ను బట్టి చారిత్రక చిత్రం అనుకుం టారు గానీ ఇదొక మోడరన్ డే థ్రిల్లర్. నిజ జీవిత పా త్రల నుంచి స్ఫూర్తి పొంది ఈ కథను రాశాను. ఇందు లో రెండు విధాలుగా అనుష్క పాత్ర ఉంటుంది. ఆమె తో పాటు మిగతా క్యారెక్టర్లను ప్రేక్షకులు తమతో పోల్చుకునేలా ఉంటాయి. అన్నారు. భాగమతిలో అనుష్క స్నేహితుడు ప్రభాస్ ఓ అతిథి పాత్రలో నటిస్తా రని ఊహాగానాలు వినిపించాయి. తాజాగా విడుదల తేదీ దగ్గరకు వస్తుండటంతో.ఇందులో నిజం లేదని తెలుస్తోంది.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి