ఢిల్లీలో హైఅలర్ట్
- January 22, 2018
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఈ వారం రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలు.. ఢిల్లీ పోలీసులను హెచ్చరించాయి. ఈ వారంలోనే గణతంత్య్ర దినోత్సవ వేడుకలు, ఢిల్లీ వేదికగా జరగనున్న ఏషియన్ సమ్మిట్, పద్మావత్ సినిమా విడుదల నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజ్‌పథ్‌తో పాటు ఢిల్లీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు. పద్మావత్ సినిమా విడుదలను అడ్డుకుంటామని ఆందోళనకారులు హెచ్చరిస్తుండటంతో.. పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ మూడు ఈవెంట్స్ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జనవరి 24 నుంచి 26 ఏషియన్ సమ్మిట్ జరగనుంది. 25న పద్మావత్ విడుదల కానుంది. 26న రిపబ్లిక్ డే వేడుకలు జరగనున్నాయి. గణతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో రాజ్‌పథ్‌లో పోలీసులు రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. రాజ్‌పథ్ వద్ద ఎన్‌ఎస్‌జీ కమాండోస్, స్పెషల్ ఫోర్స్ బందోబస్తులో ఉన్నాయి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







