అలాస్కాలో సునామి హెచ్చరికలు జారీ
- January 23, 2018
జునెయు : మంగళవారం తెల్లవారు జామున అలాస్కాలో తీవ్ర భూకంపం సంభవించింది. రిచ్టర్ స్కేలుపై దీని తీవ్రత 8.2గా నమోదైంది. సునామీ వచ్చే అవకాశాలున్నాయని అప్రమత్తంగా వుండాల్సిందిగా ప్రజల్ని అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంతం నుండి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాల్సిందిగా కోరారు. అలాస్కాలోని చినియాక్కు ఆగేయంగా 256 కిలోమీటర్ల దూరంలో భూమిలో 10కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని అమెరికా భూగర్భ సర్వే తెలిపింది. అలాస్కాలోని పలు ప్రాంతాలు, కెనడా, అమెరికా పశ్చిమ తీర ప్రాంతం, హవాయి ద్వీపంలో సునామి హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇప్పటివరకు వున్న సమాచారాన్ని బట్టి ఈ భూకంపం ధాటికి సునామీ వచ్చే అవకాశాలు వున్నాయని, అదే గనుక జరిగితే తీరప్రాంతాల్లో భీకర నష్టం జరుగుతుందని వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







