జీతాల్లేక దుర్భర జీవితం గడుపుతున్న కార్మికులు
- January 25, 2018_1516864197.jpg)
మనామా: జింజ్‌లోని ఓ కంపెనీ, కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయి. కరెంటు ఛార్జీలు చెల్లించలేని పరిస్థితుల్లో వారి ఆవేదన వర్ణనాతీతంగా మారింది. అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో ఆ కంపెనీలో కార్మికులు పనిచేస్తున్నారు. మూడు నెలల నుంచీ ఆ కంపెనీ వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు తిండికి సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశంపై కంపెనీ ప్రతినిథుల్ని సంప్రదించేందుకు ఎన్ని ప్రయత్నాలు జరిగినా అవి విఫలమవుతూనే ఉన్నాయి. జనరల్ ఫెడరేషన్ ఆఫ్ బహ్రెయిన్ ట్రేడ్ యూనియన్ (జిఎఫ్బిటియు) వెల్లడించిన వివరాల ప్రకారం బహ్రెయిన్‌లో పలు ప్రముఖ కంపెనీలు కూడా, తమ సంస్థల్లో పనిచేస్తున్నవారికి నెలల తరబడి జీతాలు చెల్లించలేకపోతున్నట్లు తెలుస్తుంది. 100 మందికి పైగా ఉద్యోగులు గత 10 నెలలుగా వేతనాలు లేక నరకయాతన అనుభవిస్తున్నట్లు జిఎఫ్బిటియు అసిస్టెంట్ సెక్రెటరీ - ఇంటర్నేషనల్ రిలేషన్స్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి