అమెజాన్ షాపింగ్ విప్లవం: చెక్ అవుట్ లేని సూపర్ మార్కెట్లు
- January 25, 2018_1516865660.jpg)
Reuters స్మార్ట్ ఫోన్‌తో స్కాన్ చేసి అమెజాన్ గో స్టోర్‌లోనికి వెళుతున్న కస్టమర్లు
షాపింగ్‌లో విప్లవం సృష్టిస్తూ అమెరికాలో అమెజాన్ చెక్ అవుట్ లేని సూపర్ మార్కెట్‌ను ప్రారంభించింది. సోమవారం సియాటిల్‌లో ప్రారంభమైన ఈ సూపర్ మార్కెట్‌ను తెరవడానికి ముందే ప్రజలు పెద్ద ఎత్తున దాని ముందు నిలబడ్డారు.
ఈ సూపర్ మార్కెట్లో వందల కొద్దీ సీసీటీవీలు, ఎలెక్ట్రానిక్ సెన్సార్లను ఏర్పాటు చేశారు. ప్రతి కస్టమర్ ఏమేం తీసుకుంటున్నాడో వాటి ద్వారా గుర్తిస్తారు.
మొత్తం షాపింగ్ పూర్తి చేసుకుని బయటకు వెళ్లేప్పుడు వాళ్ల క్రెడిట్ కార్డులోంచి బిల్లు చెల్లింపు జరుగుతుంది.
గో స్టోర్ లోనికి ప్రవేశించడానికి, అమెజాన్ గో ఆప్ కలిగిన స్మార్ట్ ఫోన్‌తో స్కానింగ్ చేయాల్సి ఉంటుంది.
ఈ స్టోర్‌లో సాండ్ విచెస్, సలాడ్స్, డ్రింక్స్, బిస్కెట్స్, ఏవైనా షాపింగ్ బ్యాగ్‌లలో వేసుకోవచ్చు.
బిల్లింగ్ వద్ద తిరిగి తెరవాల్సిన అవసరం లేనందువల్ల వాటిని ట్రాలీలు లేదా బాస్కెట్‌లో వేసుకోవాల్సిన అవసరం లేదు. అల్కాహాల్ కొనుగోలుకు అవసరమైన ఐడీ చెక్ కోసం తప్ప, ఇక్కడ అసలు ఎలాంటి మానవ ప్రమేయం ఉండదు.
అమెజాన్ చేతిలో మీ ఇంటి తాళం!
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి