రవితేజ 'టచ్ చేసి చూడు' సెన్సార్ టాక్..!

- January 25, 2018 , by Maagulf
రవితేజ 'టచ్ చేసి చూడు' సెన్సార్ టాక్..!

తెలుగు ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన రవితేజ తర్వాత కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు వేసి 'ఇడియట్' చిత్రంతో హీరోగా మారారు. అప్పటి నుంచి వరుస విజయాలతో దూసుకెళ్లిన రవితేజ మాస్ మహరాజుగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. కాకపోతే గత మూడు సంవత్సరాల నుంచి అపజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.ఈ నేపథ్యంలో గత సంవత్సరం 'రాజా ది గ్రేట్' తో సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు. 'రాజా ది గ్రేట్' చిత్రం తరువాత 'టచ్ చేసి చూడు' అంటూ మాసివ్ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. షూటింగ్ అనంతర కార్యక్రమాల్లో భాగంగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ పొందింది.ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహించారు. ఇదిలా ఉంటే..ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ని జనవరి 25న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. ఆడియోని కూడా అదే రోజు విడుదల చేయాలని మొదట ప్లాన్ చేసినా.. కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారని తెలుస్తోంది.ఈ నెల 27న ఆడియో వేడుకను నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్‌లో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) వల్లభనేని వంశీ మోహన్ ఈ సినిమాను నిర్మించారు.ఈ సినిమా తరువాత రవితేజ నటించబోతున్న 'నేల టికెట్' చిత్ర షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com