భారీగా పెరిగిన బంగారం ధర
- January 25, 2018
బంగారానికి మళ్లీ రెక్కలు వచ్చాయి. గురువారం నాటి మార్కెట్లో బంగారం ధర మళ్లీ పెరిగింది. దాదాపు రెండేళ్ల గరిష్టానికి పసిడి ధర ఎగబాకింది. మరోవైపు డాలర్ విలువ మూడేళ్ల కనిష్టానికి పడిపోయింది. నేటి మార్కెట్లో రూ.156 పెరిగి పది గ్రాముల బంగారం ధర రూ.30,405కి చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో 0.3శాతం పెరిగి ఔన్సు బంగారం ధర 1360.60డాలర్లకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో 2016 ఆగస్టు నెల తర్వాత బంగారం ధర ఈ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. పసిడి ధర మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వెండి కూడా పసిడి బాటలోనే నడిచింది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర 0.2శాతం పెరిగింది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







