ఎర్రని రంగు ఉన్న నీటిలో చేపల వేట వద్దని శాటిలైట్ల సూచన
- January 25, 2018
రస్ అల్ ఖైమా : సాంకేతికత సాగరాన్ని శాసిస్తుంది. దీని సహాయంతో సముద్రం అల్లకల్లోలంగా ఉందని చెప్పడమే కాక నీటి రంగులను సైతం గుర్తించి ఆ మార్పు ప్రభావసంగా ఏమేమి ఉపద్రవాలు సంభవిస్తాయి సైతం శాస్త్రవేత్తలు పసిగట్టేస్తున్నారు. వేల కిలోమీటర్ల ఎత్తున ఉండే శాటిలైట్ల చర్మవ్యాధులు వచ్చే ప్రాంతాలు చేపలు పట్టేవారికి, ఈత కొట్టేవారికి యూఏఈ వాతావరణ మార్పులు మరియు పర్యావరణ శాఖా హెచ్చరికలు జారీ చేసింది. స్పెషల్ ఎకానమిక్ జోన్ ప్రాంతమైన అరేబియన్ గల్ఫ్ పశ్చిమతీరం, ఒమన్ గల్ఫ్ పశ్ఛిమ తీరంలో సముద్రపు నీళ్లు ఎరుపుగా మారాయి. వాతావరణంలో మార్పుల కారణంగా సముద్రపు నీటి ఉష్ణోగ్రతలో పలు మార్పులు ఏర్పడ్డాయి. దీంతో క్లోరోఫిల్ వర్ణద్రవ్యాలు నీళ్లలో కలవడంతో సముద్రంలో జీవసంబంధమైన చర్య ఏర్పడింది.. శైవలాల విడుదల వల్ల నీళ్లు ఎర్రగా మారాయి. ఈ చర్య కారణంగా సముద్రంలో సూక్ష్మ జీవులు పుడతాయి. ఈ సూక్షజీవులు వల్ల చేపలు, ఇతర సముద్రపు జీవులకు హానిలేకపోయినప్పటికీ మనుషులకు హానికరమని అధికారులు హెచ్చరించారు. చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. సముద్రంలోని ఈ మార్పును శాటిలైట్ల ద్వారా గుర్తించామని అధికారులు తెలిపారు. సముద్రం గులాబీ రంగులో మారిన ప్రాంతంలో ఎట్టి పరిస్థితిలో చేపలు పట్టవద్దని, ఈత కొట్టవద్దని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







