బేబీ గేమ్స్‌ ప్యానెల్‌ తొలి మీటింగ్‌

- January 26, 2018 , by Maagulf
బేబీ గేమ్స్‌ ప్యానెల్‌ తొలి మీటింగ్‌

మనామా: బహ్రెయిన్‌ ఒలింపిక్‌ కమిటీ (బిఎసి), మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అలాగే మినిస్ట్రీ ఆఫ్‌ లేబర్‌ అండ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ ప్రతినిథులతో సమావేశం ఏర్పాటు చేసింది. బహ్రెయిన్‌లో బేబీ గేమ్స్‌ నిర్వహణకు సంబంధించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కిండర్‌గార్టెన్స్‌కి ఆటల పోటీలు నిర్వహించడంపై పలు అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. ఇసా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ - రిఫ్ఫాలో పలు రకాలైన ఆటల పోటీలు పిల్లల కోసం నిర్వహించాలనే డిమాండ్లు వస్తున్నాయి. బిఓసి ప్రాజెక్ట్స్‌ డైరెక్టర్‌ లోనెస్‌ మాదెన్‌, ఈ మేరకు ఓ ప్రెజెంటేషన్‌ని ఈ సమావేశంలో ఇచ్చారు. ఏప్రిల్‌లో పోటీలు నిర్వహిస్తారు. అన్ని కిండర్‌గార్టెన్స్‌ ఈ పోటీలకు సంబంధించి రిజిస్ట్రేషన్స్‌ చేసుకోవాలనీ, ఫిబ్రవరి 8లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సమావేశంలో తీర్మానించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com