'తెలుగు కళా స్రవంతి-అబుధాబి' వారి సంక్రాంతి మరియు గణతంత్ర దినోత్సవ సంబరాలు

- January 27, 2018 , by Maagulf

అబుధాబి:తెలుగు కళా స్రవంతి అబుధాబి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు కార్యక్రమం విజయవంతంగా జరిగింది.ఈ కార్యక్రమానికి దాదాపు 800 వందల తెలుగు ప్రజలు హాజరయ్యారు.మొదటగా తెలుగు బడి పిల్లల గణతంత్ర దినోత్సవ ప్రత్యేక కార్యక్రమం జరిగింది.ఇందులో స్వాతంత్ర సమరయోధుల పాత్రలు చిన్నారులు వేసి కార్యక్రమానికి ఆకర్షణగా నిలిచారు.తర్వాత స్త్రీలకు ముగ్గుల పోటీలు,పిల్లలకు భోగి పళ్ళు మరియు ఆటల పోటీలు నిర్వహించారు.అనంతరం తెలుగు వంటకాలతో అతిధులందరికి భోజనం వడ్డించారు.సాయంత్రం పోటీలలో గెలిచినా వారికి బహుమతులు అందజేశారు.కొత్త సంవత్సరం కేలండర్ ఆవిష్కరించి పంచారు.ఈ కార్యక్రమంలో తెలుగు బడి బృందం,వనిత టీం,తెలుగు కళా స్రవంతి కో-ఆర్డినేటర్స్ పాల్గొని దిగ్విజయం చేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com