సౌదీ యువరాజు అల్వాలీద్ బిన్ తలాల్ విడుదల
- January 27, 2018
రియాద్ : సౌదీ ప్రభుత్వ అధికారులకు ప్రిన్స్ అల్వాలీద్ బిన్ తలాల్ మధ్య జరిగిన చర్చలు ఫలప్రదం కావడంతో ఆ ఒప్పందంను అటార్నీజనరల్ ఆమోదించిన నేపథ్యంలో శనివారం ఉదయం యువరాజు తలాల్ ను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సౌదీ ఉన్నతాధికారి ఒకరు అంతర్జాతీయ ప్రముఖ వార్త సంస్థ రాయిటర్ ప్రతినిధితో మాట్లాడుతూ, " ప్రిన్స్ అల్వాలీద్ బిన్ తలాల్ శనివారం ఉదయం11 గంటలకు (గ్రీనిచ్ మీన్ టైం కాలమాన ప్రకారం 0800 ) ఇంటికి క్షేమంగా తిరిగి చేరుకున్నారని తెలిపారు. సౌదీ అరేబియా రాజ్యంలో యువరాజుగా ప్రిన్స్ ఆల్వాలేడ్ తిరిగి తన అధికార పదవిని కొనసాగించగలరా అని రాయిటర్ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు "ఖచ్చితంగా" కొనసాగించవచ్చని ఆ అధికారి సమాధానమిచ్చారు. అంతకు ముందు రియాద్ లోని రిట్జ్ కార్ల్టన్ హోటల్ లో తన ఖరీదైన గది వద్ద రాయిటర్ ప్రతినిధితో సౌదీ యువరాజు అల్వాలీద్ బిన్ తలాల్ ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సౌదీ అరేబియా డిప్యూటీ ప్రీమియర్ , రక్షణ మంత్రి క్రౌన్ ప్రిన్స్ ముహమ్మద్ బిన్ సల్మాన్ అమలుచేస్తున్న విప్లవాత్మక సంస్కరణలకు తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!







