దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు

- January 27, 2018 , by Maagulf
దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు

జోహన్స్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి టెస్టులో టీంఇండియా విక్టరీ కొట్టింది. బౌన్సీ  పిచ్ పై సఫారీ ఆటగాళ్లను ఎట్టకేలకు మట్టి కరిపించి క్లీన్ స్వీప్ నుండి బయటపడింది. దీంతో టీమిండియా 63 పరుగుల తేడాతో విజయ దుందుభి మోగించింది. టీమిండియా బౌలర్లలో షమీ 4 వికెట్లు తీయగా, బుమ్రా, ఇషాంత్ శర్మలకి రెండేసి వికెట్లు, భువనేశ్వర్ కుమార్‌కి ఒక వికెట్ దక్కాయి. కాగా, మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 187 పరుగులకి ఆలౌట్ కాగా, దక్షిణాఫ్రికా 194 పరుగులకి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన భారత్ 247 పరుగులు చేసింది. 241 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభిన దక్షిణాఫ్రికా 177 పరుగులకే కుప్పకూలింది. దీంతో 63 పరుగుల తేడాతో విజయాన్నందుకుంది భారత్, అలాగే 1-2 సిరీస్ ను కోల్పోయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com