యశ్‌చోప్రా పురస్కారం అందుకోనున్న ఆశాభోంస్లే
- January 27, 2018
ప్రముఖ దర్శకనిర్మాత యశ్‌చోప్రా పేరుతో సుబ్బిరామిరెడ్డి ఫౌండేషన్ ఏర్పాటు చేసిన నేషనల్ యశ్‌చోప్రా మెమోరియల్ అవార్డును 2017కి గానూ ప్రముఖ నేపథ్యగాయని ఆశాభోంస్లేకు ప్రదానం చేయనున్నారు. పదేళ్లప్రాయంలో నేపథ్య గాయనిగా కెరీర్‌ను ప్రారంభించిన ఆశాభోంస్లే వందలాది చిత్రాల్లో వేలాది పాటలు పాడి చిత్ర పరిశ్రమకి సేవ చేశారు. ముంబయిలో ఫిబ్రవరి 16న జరిగే వేడుకలో మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్‌రావు, ప్రముఖ గాయని లతామంగేష్కర్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని ఆశాభోంస్లే స్వీకరిస్తారు. యశ్‌చోప్రాతో ఉన్న అనుబంధంతో ఆయన జ్ఞాపకంగా టి.సుబ్బిరామిరెడ్డి 2013 నుంచి సినీ ప్రముఖులకి ఈ పురస్కారాన్ని అందిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, లతామంగేష్కర్, రేఖ ఈ పురస్కారాన్ని అందుకొన్నవారిలో ఉన్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







