మరో బ్లాక్ బస్టర్: 'టచ్ చేసి చూడు'
- January 27, 2018
టాలీవుడ్ లో మాస్ మహరాజుగా పేరు తెచ్చుకున్న రవితేజ గత మూడు సంవత్సరాల నుంచి వరుసగా అపజాయాలు పొందుతూ వచ్చాడు. ఒకదశలో కెరీర్ కి పులిస్టాప్ పెడతాడా అన్న అనుమానాలు కూడా కలిగాయి. గత సంవత్సరం 'రాజా ది గ్రేట్' సినిమాతో మల్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాత్ రవితేజ పవర్ ఏంటో నిరూపించాడు..అంతే కాదు ఓ హీరో అంధుడిగా నటించి ఎలా మెప్పించాలో..ఈ సినిమాలో చూపించి అందరిచేత షభాష్ అనిపించుకున్నాడు. రవితేజ యాక్షన్ కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
మాస్ రాజా రవితేజ అప్ కమింగ్ మూవీ 'టచ్ చేసి చూడు' ప్రి రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో వైభవంగా జరిగింది. విక్రమ్ సిరికొండతో చేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ 'టచ్ చేసి చూడు' ఫిబ్రవరి 2 ప్రేక్షకుల ముందుకి రానుంది. లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్‌లో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) వల్లభనేని వంశీ మోహన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన వివి వినాయక్, హరీష్ శంకర్లు 'టచ్ చేసి చూడు' చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి దర్శకిడిగా పరిచయం అవుతున్న విక్రమ్ సిరికొండకు విషెష్ తెలియజేశారు.
ఇక హీరో హీరో రవితేజ మాట్లాడుతూ.. ఈ సినిమాకోసం చాలా మంది టెక్నీషియన్స్ పనిచేశారని.. ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ అందించిన కేఏజీ త్రయానికి థాంక్స్ తెలియజేశారు. దర్శకుడు విక్రమ్ సిరి తాను ఊహించిన దానికంటే అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించారన్నారు. ఈ చిత్రంతో టాలీవుడ్‌కి ఓ మంచి దర్శకుడు రాబోతున్నారన్నారు. హీరోయిన్స్ రాశీఖన్నా, సీరత్ కపూర్ గురించి మాట్లాడుతూ.. వాళ్లు ఎంత అందంగా ఉంటారో వాళ్ల ప్రవర్తన కూడా అంతే అందంగా ఉంటుందన్నారు. ఇప్పటికే రాశీతో ఓ సినిమా చేశానని, సీరత్‌తో ఇదే తొలి చిత్రమన్నారు. ఈ సినిమాకు వక్కంతం వంశీ మంచి కథ అందించారని తప్పకుండా 'టచ్ చేసి చూడు' ప్రేక్షకులను అలరిస్తుందన్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







