దూసుకుపోతున్న 'భాగమతి'
- January 27, 2018
హైదరాబాద్: అనుష్క తాజాచిత్రం ‘భాగమతి’ భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలిరోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. మొదటిరోజు మొత్తం రూ. 12 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేశారు. అమెరికాలో 1,56, 538 డాలర్లు వసూలు చేసింది. దక్షిణాదిలో మహిళ ప్రాధాన్యమున్న చిత్రాల్లో అత్యధిక ఆరంభ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
పాజిటివ్ టాక్, రివ్యూలు రావడంతో మార్నింగ్ షోల తర్వాత ప్రేక్షకాదరణ మరింత పెరిగింది. దీంతో మున్ముందు కలెక్షన్లు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. తమ సినిమాకు వస్తున్న స్పందన పట్ల ‘భాగమతి’ చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాకు జి.అశోక్ దర్శకత్వం వహించారు. అనుష్కకు జోడిగా మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ నటించాడు. తమన్ సంగీతం అందించాడు.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







