గేల్‌ను ఆదుకున్న ప్రీతి
- January 28, 2018
బెంగళూరు: క్రిస్ గేల్.. ప్రపంచానికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ట్వంటీ 20ల్లో అమోఘమైన రికార్డు ఈ విధ్వంసకర క్రికెటర్ సొంతం. ప్రధానంగా సిక్సర్ల కింగ్‌గా పిలుచుకునే గేల్... ఈసారి ఐపీఎల్ వేలంలో ఎట్టకేలకు అమ్ముడుపోయాడు. గేల్‌ను రూ. 2 కోట్లకు కింగ్స్ పంజాబ్ చివరి నిమిషంలో దక్కించుకుంది. అతనికున్న కనీస ధరకే కింగ్స్ పంజాబ్ సొంతం చేసుకుంది. కింగ్స్ పంజాబ్ సహ యజమాని ప్రీతిజింతా కనికరించడంతో గేల్‌కు ఊరట లభించినట్లయ్యింది.
శనివారం తొలి రోజు వేలంలో అమ్ముడుపోని గేల్.. ఆదివారం రెండో రోజు వేలం ఆరంభంలో కూడా అమ్ముడుపోలేదు. ఈ రోజు అన్‌సోల్డ్ వేలం పాటలో భాగంగా తొలుత గేల్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. కాగా, అమ్ముడుపోని క్రికెటర్లకు ఆఖర్లో మరొకసారి వేలం జరగ్గా గేల్‌ను కొనుగోలు చేయడానికి కింగ్స్ పంజాబ్ ఆసక్తి చూపింది. అతని కనీస ధర రూ. 2 కోట్లకే కింగ్స్ పంజాబ్ కొనుగోలు చేసింది. అయితే న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు గప్టిల్‌కు మూడోసారి కూడా నిరాశే ఎదురుకావడం గమనార్హం.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి