కత్తెరతో పేగులను కత్తిరించుకుని ఆత్మహత్య యత్నం చేయబోయిన ప్రవాస భారతీయుడు

- January 28, 2018 , by Maagulf
కత్తెరతో పేగులను కత్తిరించుకుని ఆత్మహత్య యత్నం చేయబోయిన ప్రవాస భారతీయుడు

కువైట్: ఆత్మహత్యలలోనూ వైవిధ్యం చూపించాలని కాబోలు ఆ ప్రవాసియ భారతీయడు వింతగా విషాదంగా జీవితాన్ని ముగించాలనుకొన్నాడు. ఒక పదునైన కత్తెరతో కడుపులో బలంగా పొడుచుకొని తన ప్రేగులను తానె  పర పర మని  కత్తెరతో కత్తిరించుకోవడం ప్రారంభించాడు. ఆ సమయంలో ఆ వ్యక్తికి కల్గిన విపరీతమైన నొప్పికి విలవిల్లాడిపోయాడు ఆ బాధకు తాళలేక బిగ్గరగా వామ్మో ..వాయ్యో అంటూ పోలికేకలు పెడ్తూ అటూ ఇటూ పరుగులు పెడ్తూ రక్షించండి బాబో అంటూ ఏడుపులంకించుకొన్నాడు. బాధితుని కేకలు విన్న పోలీసులు ఆ భారతీయ వ్యక్తిని  అడాన్ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ఈలోపున ఆ వ్యక్తి కడుపు నుండి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఎంతో క్లిష్టమైన స్థితిలో బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆ వ్యక్తికి శస్త్రచికిత్స చేసి కడుపులో ఉండిపోయిన ఒక కత్తెర జతను తొలగించి ఎట్టకేలకు రక్షించారు. అనంతరం నిందితుడిపై దర్యాప్తు నిమిత్తం  అంతర్గత వ్యవహారాల శాఖ అధికారులు విచారణ ప్రారంభించారు, ఆ భారతీయ వ్యక్తిని  ఫిన్టాస్ పోలీసు స్టేషన్ లో ఉంచారు అహ్మది ప్రాసిక్యూటర్ ఆదేశాలపై నిందితుడిపై ఆత్మహత్య ఆరోపణలపై కేసు నమోదు చేయబడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com