తప్పు జరిగింది క్షమించండి అంటున్న కంచి విజయేంద్ర సరస్వతి స్వామి..
- January 29, 2018
చెన్నై: తమిళనాడులోని కాంచీపురంలోని కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి జీయర్ స్వామి క్షమాపణలు చెప్పినా ఆయన మీద తమిళ సంఘాల ఆగ్రహం చల్లారడం లేదు. తమిళ తల్లి గీతాన్నీ విజయేంద్ర సరస్వతి జీయర్ స్వామి అవమానించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కంచిలోని శంకర మఠం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయం ఇంతటితో వదిలేయ్యాలని బీజేపీ మనవి చేసింది.
తమిళ తల్లి గీతం ఆలాపిస్తున్నప్పుడు విజయేంద్ర సరస్వతి ధ్యానంలో ఉండి నిలబడలేకపోయారని, అది తమిళ భాషను అవమానించినట్టుగా భావించవద్దని శంకరమఠం మనవి చేసింది. అయితే జాతీయగీతం ఆలాపన సమయంలో గౌరవంగా లేచి నిలబడిన విజయేంద్ర సరస్వతి స్వామిజీ తమిళ తల్లి గీతాన్ని ఆలాపిస్తున్న సమయంలో లేచి నిలడకపోవడం అవమానించడమేనని పలు తమిళ సంఘాలు మండిపడుతున్నాయి.కాంచీపురంలోని శంకర మఠం ముట్టడికి తమిళ విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి. ముందస్తు సమాచారం లేకుండా విద్యార్థి సంఘాలు శంకర మఠం ముందు గుమికూడటంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అప్రమత్తమైన పోలీసులు విద్యార్థి సంఘాలను అడ్డుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.కంచి శంకర మఠం ముందు పోలీసులు ఆందోళనకారుల నడుమ తోపులాట జరిగింది. ఆధ్యాత్మికతకు నిలయమైన శంకర మఠం ముట్టడికి ప్రయత్నించడం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ సందర్బంలో విజేంద్ర సరస్వతి స్వామిజీ వివరణ ఇచ్చుకున్నారు.తాను కావాలని తమిళ తల్లి గీతాన్ని అవమానించలేదని విజయేంద్ర సరస్వతి స్వామీజీ చెప్పారు. తాను తమిళ తల్లిని అవమానించానని ఎవరైనా బావిస్తే తనను క్షమించాలని విజేంద్ర సరస్వతి మనవి చేశారు. తమిళనాడులో ఉంటూ తమిళ తల్లిని అవమానించే మనస్థత్వం తనకు లేదని విజేంద్ర సరస్వతి వివరణ ఇచ్చారు.కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి క్షమాపణలు చెప్పారని, ఇక ఈ విషయం ఇంతటితో వదిలి పెట్టాలని బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు తమిళసై సౌందరరాజన్ తమిళ సంఘాలకు మనవి చేశారు. తప్పు జరిగిందని అంగీకరించిన తరువాత మళ్లీ ఈ విషయంలో రాద్దాంతం చెయ్యడం మంచిది కాదని తమిళసై సౌందరరాజన్ చెప్పారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి